గడియారం రామకృష్ణ శర్మ నాటక ప్రస్థానం
నాటి నిజాం పరగణాలో, గద్వాల సంస్థానం ఏలుబడిలో ఉన్న ఆలంపురం గ్రామంలో ఓ వెన్నెల రాత్రుల్లో ఓ సంచార నాటక సమాజం ‘‘సత్య హరిశ్చంద్ర’’ నాటకం ఆడుతున్నది. టిక్కెట్లు కొని ఆ ప్రదర్శన చూడటానికి జనమంతా వచ్చారు. అందరూ కుర్చీలకు అతుక్కుని నాటకం చూస్తున్నారు. అనుభవం కలిగిన నటీనటులు ప్రదర్శిస్తున్న ఈ నాటకానికి వచ్చిన వారంతా తన్మయులై ఉన్నారు. కళాకారులు పాడే పద్యాలకు ఒన్స్మోర్ అంటూ ప్రేక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. అది కాటి సీను. …