దక్కని సిక్కుల సాంస్కృతిక జీవితం
దక్కను పీఠభూమి ఎన్నో జాతులకు, సంస్కృతులకు పుట్టినిల్లు. ఎన్నో శతాబ్దాల తన ప్రయాణంలో ఎన్నెన్నో జాతులను ఇముడ్చుకున్నది. భిన్న ఆదివాసి జాతులకు ఆలవాలమైన ఈ భూమి ఆధునిక సంస్కృతులకు కూడా వేదికైంది. దక్కను ప్రాంతం గురించి చెప్పడమంటే అప్పటి హైదరాబాద్ స్టేట్ గురించి చెప్పడమే. అంతేకాకుండా తెలంగాణ తన చరిత్రను మరింత విస్తృతపర్చుకోవడం కూడా అవుతుంది. వివిధ ముస్లిం రాజుల పరిపాలన కాలంలో దక్కనులో ఎన్నో జాతులు వచ్చి స్థిరపడ్డాయి. ఇక్కడి సంస్కృతులతో ఆ జాతులు మమేకమై …