సమిష్టి కృషే మానవాళి మనుగడకి రక్షణ
సమసిపోతుందనుకున్న కరోనా సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరింత ఉధృతంగా వచ్చింది. అంతకు ముందెన్నెడూ లేనంతగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ‘టైమ్స్’ సర్వే ప్రకారం ప్రభుత్వ లెక్కలకు ముప్పైరెట్లు కేసులున్నట్లు తెలుస్తోంది. సెకండ్ వేవ్ గురించి మొదటి నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక పరిశీలకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొదటి కోవిడ్ సమయంలో దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక ఇంటర్వ్యూలలో కూడా పలురంగాల మేధావులు యిదే చెప్పారు. ఇప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)లో మనమున్నాం. ఇంతకు …