నదుల పరిరక్షణ తక్షణ అవసరం
ప్రతి సంవత్సరం పర్యావరణ ప్రేమికులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై దృష్టి పెడుతున్నట్లే ఈ సంవత్సరం థీమ్ ‘ఓన్లీ వన్ ఎర్త్’. ఈ సమస్త విశ్వంలో ప్రాణకోటికి జీవించగల అవకాశం ఉన్నది ఈ ఒకే ఒక్క భూమిపై మాత్రమే. ఈ భూమిపై గల ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ మానవాళి సహజీవనం చేయాల్సి వుంటుంది. నిజానికి ఏం జరుగుతోంది? ప్రకృతి వనరుల సంరక్షణ కంటే వినియోగం …