deccanland

జాఫర్ మాము

(గత సంచిక తరువాయి)సగం చచ్చిన శవంలా ఉన్న జాఫర్‍ వొదినను ఒక మరాఠా పహీల్వాన్‍ తన బుజాల మీద వేసుకుని గుర్రం వైపు ఉరుకుతుంటే ఆమె ఏడేండ్ల కొడుకు ‘‘మేరే అమ్మీకో మత్‍ లేజావ్‍, ఉస్కో చోడ్‍ దో’’ అనుకుంట అతనికి అడ్డమడ్డం తిరిగిండు. దాంతో ఆ దుర్మార్గుడికి కోపం వచ్చి చేతిల ఉన్న తల్వార్‍ను ఆ పసిపోరడి మెడవైపు ఝుళిపించిండు. అంతే వొక్క వేటుతో ఆ పిల్లగాడి తల లేత మెడ నుండి వేరయ్యి క్రింద …

జాఫర్ మాము Read More »

జాతీయ పర్యాటక దినోత్సవం

భారతదేశం యొక్క జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25న జరుపుకుంటారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. భారతదేశం యొక్క గొప్ప చరిత్ర, సాంస్క•తిక, భౌగోళిక వైవిధ్యం దేశాన్ని విదేశీ ప్రయాణీకులలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా మార్చింది. ఇది సాంస్క•తిక, వారసత్వం, క్రూయిజ్‍, ప్రక•తి, విద్య, వ్యాపారం, క్రీడలు, గ్రామీణ, వైద్యం మరియు పర్యావరణ పర్యాటకంతో సహా వివిధ రకాల పర్యాటకాలను అందిస్తుంది. పర్యాటకం …

జాతీయ పర్యాటక దినోత్సవం Read More »

30 ఏళ్ల తర్వాత వరంగల్‍లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇండియన్‍ హిస్టరీ కాంగ్రెస్‍

ఇండియన్‍ హిస్టరీ కాంగ్రెస్‍ (Indian History Congress-IHC) : 1935లో స్థాపించబడిన ఇండియన్‍ హిస్టరీ కాంగ్రెస్‍ దక్షిణాసియాలో వ•త్తిపరమైన చరిత్రకారుల సంఘం. దీనిలో సుమారు 35,000 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రతి సంవత్సరం 2,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ఇది ప్రారంభమైనప్పటి నుండి చాలా క్రమం తప్పకుండా తన సమావేశాలను నిర్వహించడమే కాకుండా ప్రతి సంవత్సరం తన కార్యకలాపాలను ప్రచురిస్తోంది. చరిత్ర యొక్క లౌకిక మరియు శాస్త్రీయ రచనను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. …

30 ఏళ్ల తర్వాత వరంగల్‍లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇండియన్‍ హిస్టరీ కాంగ్రెస్‍ Read More »

లోహ్రి (భోగి) సంబరాలు

భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా సమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. ఈ పండగలను చేసుకొనే ప్రాముఖ్యత మరియు విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, పండుగలో ఉన్న సారాంశం మరియు పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి. దీనిని ద•ష్టిలో …

లోహ్రి (భోగి) సంబరాలు Read More »

కలివి కోడి.. కలివి కోడి.. కనిపించవూ!!!

‘‘భూమి ఉన్నది మానవుడి ఆశలు తీర్చడానికే గాని అత్యాశలు తీర్చడానికి కాదు’’ అన్న మహాత్మా గాంధీ మాటలు నేటి ఆధునిక మానవుడు చెవికెక్కించుకోలేదు. అందుకే కాబోలు, భూమిపై మానవాళి మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, క్రిమి కీటకాదులు, మొక్కలు తదితర జీవజాలం ఉందన్న సంగతినే మరిచి తన స్వార్థం కోసం భూమి పై ఉన్న సమస్త వనరుల్ని కబలించడం మొదలుపెట్టాడు. దీంతో అనేక జంతువులు పక్షులకు, భూమిపైన నిలువ నీడ లేకుండా పోయింది. మానవుడి అత్యాశకు అనేక …

కలివి కోడి.. కలివి కోడి.. కనిపించవూ!!! Read More »

ఉమ్మడి నల్గొండ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం 14,170 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. దీనికి ఉత్తరాన మెదక్‍, వరంగల్‍ జిల్లాలు, పశ్చిమంలో రంగారెడ్డి, మహబూబ్‍నగర్‍ (కొంత భాగం), తూర్పు ఖమ్మం, కృష్ణా (ఏ.పి.), దక్షిణంలో మహబూబ్‍నగర్‍, గుంటూరు (ఏ.పి) జిల్లాలు కలవు. హైదరాబాద్‍-విజయవాడ నేషనల్‍ హైవే (ఎన్‍హెచ్‍-9), హైదరాబాద్‍- కాజీపేట, హైదరాబాద్‍ – గుంటూరు బ్రాడ్‍ గేజి రేల్‍ వే లైన్స్ ఈ ప్రాంతంగుండా వెళ్తుంది. ఈ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలోని కొంత భాగం తప్ప మిగతా ప్రాంతం ఒక …

ఉమ్మడి నల్గొండ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద Read More »

రాజస్థాన్‍ కొండ కోటలు

ఉనికి: రాజస్థాన్‍ప్రకటిత సంవత్సరం: 2013విభాగం: సాంస్క•తికం (సీరియల్‍ సైట్‍) ఈ సీరియల్‍ సైట్‍లో చిత్తోడ్‍ గఢ్‍, కుంభాల్‍ గఢ్‍, సవాయి మాధోపూర్‍ ఝలావర్‍, జైపుర్‍ మరియు జైసల్మేర్‍లలో ఆరు అందమైన కోటలు ఉన్నాయి, వీటిలో విస్త•తమైన ఆస్థాన సంస్క•తులు అభివ•ద్ధి చెందాయి. ఎనిమిదో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల వరకు ఈ ప్రాంతంలో వర్ధిల్లిన రాజ్‍పుత్‍ రాచరిక రాజ్యాల శక్తికి కోటల పరిశీలనాత్మక వాస్తుశిల్పం సాక్ష్యంగా నిలుస్తుంది. రక్షణ గోడల లోపల ప్రధాన పట్టణ కేంద్రాలు, రాజభవనాలు, …

రాజస్థాన్‍ కొండ కోటలు Read More »

బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు

‘‘సియాసత్‍’’ అంటే ఉర్దూలో రాజకీయం అని అర్థం. ఈ అర్థం తెలియని నాటి నుంచే సియాసత్‍తో మాకు చిన్నప్పటి నుంచి ఒక గాఢమైన అనుబంధం. సియాసత్‍.. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఉర్దూ దినపత్రికల్లో ఒకటి. హైదరాబాద్‍ నగరం నుంచి వెలువడే సియాసత్‍ ప్రతీ రోజు మా ఇంట్లో దర్శనం ఇచ్చేది. దాని శీర్షిక మీద అర్ధ చంద్రాకారంలో ఉండే నల్లని గదిలో తెల్లని పావురం బొమ్మ ఆకట్టుకునేది. మా తండ్రి అంబారావు దేశ్‍పాండే ప్రతి రోజు …

బాబా – సియాసత్‍ మరికొన్ని అనుబంధాలు Read More »

పురాచరిత్రలో కొత్త వెలుగులు

హైద్రాబాద్‍ నగరానికి సమీప మండలం బొమ్మలరామారం. పేరుకు తగ్గట్టే ఈ రామారం మండలంలో ఎన్నెన్నో రాతిచిత్రాలు లభిస్తున్న చరిత్రపూర్వయుగ క్షేత్రాలు. వాటిలో మధ్యరాతియుగం, కొత్తరాతియుగం పనిముట్లు, పెదరాతియుగం సమాధులు, కొత్త, కొత్త రాతిచిత్రాల తావులు. కుంచెలతో ఎరుపురంగు గీతలలో చిత్రించిన చిత్రాలే కాదు, చేతిలోని పనిముట్లతో రాతి ఉపరితలాల మీద గీరి, గంట్లుపెట్టి వేసిన బొమ్మలు (పెట్రోగ్లైఫ్స్) ఎన్నెన్నో. అవి పురామానవుల జీవన సంస్క•తికి దర్పణాలు. అన్వేషిస్తున్న కొద్దీ ఈ ప్రాంత మంతా పురామానవుల ఆవాసాలున్న ఆధారాలు …

పురాచరిత్రలో కొత్త వెలుగులు Read More »

అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake

మొదటిసారి జాతీయ విద్యావిధానంలో నాణ్యమైన విద్యా లోపం దాని తీవ్రతను గుర్తించి 5 కోట్ల మంది విద్యార్థులకు కనీస విద్యా సామర్ధ్యాలు లేవని ఈ విషయంలో ప్రభుత్వాలు తక్షణమే సరైన భాషా సామర్ధ్యాలు, గణిత నైపుణ్యాలు అందించే దిశగా రాజీపడకుండా స్పందించాలని లేని పక్షంలో వచ్చే 5 సంవత్సరాలలో 10 కోట్ల మంది విద్యార్థులు బడికివచ్చి కూడా నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారని బలంగా చెప్పింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దేశంలో విద్యావిధానం గురించి మాట్లాడం అర్థం …

అభ్యాసనా సంక్షోభం – ప్రమాదంలో భవిష్యత్తు తరాలు Learning Crisis – Future at Stake Read More »