deccanland

పిల్లలే నయం

‘‘గొప్ప ఉపన్యాసం చేయలేని పని ఓ చిన్న కథ చేస్తుంది.’’నేను ఉంటున్న గేటెడ్‍ కమ్యూనిటీలో ఓ సంవత్సరం క్రితం ఓ సంఘటన జరిగింది. ఓ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకున్నారు. ఆది చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ తరువాత పెద్దవాళ్ల జోక్యం మొదలైంది. కమ్యూనిటీలో ఓ వాట్సప్‍ గ్రూప్‍ ఉంది. అందులో నేను కూడా ఓ సభ్యుడినే. ఆ గ్రూపు నిండా ఆ గొడవకి సంబందించిన చర్చలే చర్చలు. చివరికి తిట్టుకునే స్థాయికి చేరుకుంది. ఇరు …

పిల్లలే నయం Read More »

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ

(2023వ సంవత్సరానికి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ సాంకేతికతపై పరిశోధనకు గానూఫిజియాలజి (మెడిసిన్‍) విభాగంలో నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…) (గత సంచిక తరువాయి) ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లు – ప్రయోజనాలు : ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లను సులభంగా, వేగంగా తయారు చేయవచ్చు. ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో కొత్తరకం వైరస్‍లకు టీకాలను రూపొందించడమే గాకుండా, తరచూ మారిపోయే సార్స్ (SARS), కోవిడ్‍, ఇన్‍ప్లూయెంజా వంటి వైరస్‍లను ఎదుర్కొనే టీకాలను అతి త్వరగా పునరుద్దరించవచ్చు. మానవాళికి సవాల్‍గా నిలుస్తున్న జబ్బులకూ ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానం పరిష్కారం చూపనుంది. …

వ్యాక్సిన్‍ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్‍ టెక్నాలజీ Read More »

తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం

మనం పలు సందర్భాలలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. వివక్షల గురించి గొంతెత్తుతూ ఉంటాం. సామాజిక రుగ్మతల గురించి వాటిని నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాం. ఏ ఒక్క సదర్భంలోనూ మనకు పర్యావరణ న్యాయం గురించి గుర్తుకు రాదు. అసలు అటువంటిది ఒకటుందనే విషయం కూడా స్ఫురించదు. ఎవరి రాజకీయ దృక్పథాలు ఏవైనప్పటికి, భిన్న సామాజిక సమూహాలు ఏ రాజకీయ లక్ష్య ప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నప్పటికీ అందరమూ ఆలోచించవలసిన అవసరం …

తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం Read More »

ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ

ముడుమాల గ్రామం, నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని పరిరక్షించడానికి, డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ పరిశోధనలు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ (DHAT) ఆధ్వర్యంలో పరిశోధనా బ•ందంతో కలిసి 2023 డిసెంబర్‍ 20 నుండి డిసెంబర్‍ 22 వరకు అధ్యయనం చేశారు. డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ 2023 సంవత్సరం జూన్‍ నెలలో, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమి ట్రస్ట్తో నారాయణపేట జిల్లాలో, క•ష్ణా మండలంలో ముడుమాల గ్రామంలో ఉన్న నిలువు రాళ్ళ ప్రదేశాన్ని …

ముడుమాల్‍ నిలువురాళ్లు పరిరక్షణ Read More »

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!

ఆ చల్లని సముద్ర గర్భం!దాచిన బడబాగ్నిలెన్నో…!!సౌరకుటుంబంలో భూగ్రహం రూపొందడం ఓ ప్రకృతి వింతనే! ఈ రూపాంతరం గూర్చి గత సంచికల్లో (మార్చి 2021 నుంచి జూన్‍ 2021) స్థూలంగా వివరించడం జరిగింది. ఇలా ఏర్పడిన గ్రహం మూడు ఆవాసాలుగా చూడవచ్చు! నింగి, నేల, నీరు అంటూ ప్రస్థావిస్తాం! నింగి, నేల గూర్చి తెలిసినంతగా నీటి ఆవాసాల గురించి తెలిసింది చాలా తక్కువే! నీటి ఆవాసాలు అనగానే భూమిపై గల వాగులు వంకలు, నదులు, కుంటలు, చెరువులతోపాటుగా వీటికి …

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు

అవసరానికి అప్పిచ్చువాడు, రోగాలు నివారించే వైద్యుడు, నిరంతరం ప్రవహించే నది, పురోహితుడు ఉన్న గ్రామంలో కాపురం ఉండాలి. ఇవిలేని ఊరిలో ప్రవేశించవద్దని సుమతి శతక కర్త బద్దెభూపాలుడు స్పష్టం చేశాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో గ్రామమంటే కనీసం వంద కుటుంబాలైనా ఉండాలని, రైతులు అధికంగా ఉండాలని, గ్రామపంచాయతీ పరిమితి రెండు క్రోసులైనా ఉండాలని, పొరుగు ఊర్లకి ఉత్పత్తులను సరఫరా చేయగల స్థితిలో గ్రామం ఉండాలని తెలిపాడు. ఇంకా ప్రాచీన భారతీయులు కొంత శ్రద్ద కనబరచినట్లు పాణిని అష్టాధ్యాయి, అధర్వణ …

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు Read More »

‘బాలచెలిమి’ గ్రంథాలయం ప్రారంభం జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, కుకునూరుపల్లి

నవంబర్‍ 14, బాలల దినోత్సవం రోజున జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల కుకునూరుపల్లిలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ సహకారంతో ‘బాలచెలిమి’ గ్రంథాలయాన్ని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి. శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానో పాధ్యాయులు బి. సత్తయ్య, సొసైటీ ప్రతినిధులు ఖైజర్‍, గరిపల్లి అశోక్‍, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిద్ధిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని …

‘బాలచెలిమి’ గ్రంథాలయం ప్రారంభం జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, కుకునూరుపల్లి Read More »

ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్‍

అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్‍) డిప్యూటీ డైరెక్టర్‍ జనరల్‍ డా. సురేశ్‍ కుమార్‍ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‍.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల పోషకాల గనులైన చిరుధాన్యాలను శ్రీఅన్నగా పేర్కొంటూ ఫ్యూచర్‍ హెల్దీ సూపర్‍ ఫుడ్‍గా సరికొత్త రూపాల్లో తిరిగి పరిచయం చేయటంలో సఫలీక•తమైందని …

ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్‍ Read More »

చిన్నారి స్నేహం

అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులూ కలిసి చేసేవి. ఎక్కడికైనా రెండు కలిసే వెళ్లేవి, కొంత మంది ఏనుగుల్ని ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒక దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పాయని అర్థమైంది. …

చిన్నారి స్నేహం Read More »

శబ్ద కాలుష్యం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

శబ్ద కాలుష్యం Read More »