భారత చారిత్రక సంపద చిహ్నాలు!
భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ క్రమంలో శత్రుదుర్భేద్యమైన కోటలను నిర్మించుకున్నారు. వాటిలో కొన్ని శత్రువుల దాడుల్లో ధ్వంసం కాగా.. ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొన్ని ఖిల్లాలు చెక్కుచెదరకుండా చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గ కొన్ని కోటల విశేషాలు తెలుసుకుందాం.. ఎర్రకోటదేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో మొగుల్ చక్రవర్తి …