January

అంటార్కిటికా చెపుతున్న భూతాప గోస?

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!! గత కథనాల్లో డార్వినిజంకు దారితీసిన పరిస్థితుల్ని చూసాం. ఈ సిద్దాంతం అనగానే కేవలం జీవుల పరిణామం గూర్చే అనుకుంటాం! నిజానికి డార్విన్‍, భూగర్భ విషయాలు తెలుసుకోవడానికై కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍కు తోడుగా వెళ్ళడం జరిగింది. కాని, సునిశిత ఆలోచన అనేక కొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందన్నట్లుగా, డార్విన్‍ బీగల్‍యాత్ర జీవరాశి పుట్టిన తర్వాత ఎలా మార్పు చెందిందని నిశితంగా పరిశీలించి ఓ శాస్త్రీయ సిద్ధాంతానికి పునాదులు వేసింది. అయితే, డార్విన్‍ ముందే …

అంటార్కిటికా చెపుతున్న భూతాప గోస? Read More »

అసఫ్‍జాహీల పాలనలో విద్యాభివృద్ధి

కుతుబ్‍షాహీల పతనం తర్వాత గోల్కొండ రాజ్యము మొఘలుల ఆధీనంలోకి వెళ్ళింది. అది మొఘల్‍ రాజ్యంలో ఒక సుబుగా మారింది. దీనిపై కమురుద్దిన్‍ చింక్‍లిచ్‍ ఖాన్‍ సుబేదారుగా నియమింపబడ్డారు. ఔరంగజేబు మరణం తర్వాత చింక్‍లిబ్‍ఖాన్‍ స్వతంత్రంగా పరిపాలన చేశాడు. కానీ స్వతంత్రతను మాత్రం ప్రకటించుకోలేదు. మొఘలు చక్రవర్తిలచే నిజాం అనే బిరుదు పొందాడు. ఇతని వారసులు నిజాం బిరుదుతోనే స్వతంత్రను ప్రకటించుకొని రాజ్య పరిపాలన చేశారు. అసఫ్‍జాహీ వంశస్థులైన వీరు హైదరాబాద్‍ సుబాను 1721 నుండి 1948 వరకు …

అసఫ్‍జాహీల పాలనలో విద్యాభివృద్ధి Read More »

కషాయం కాచుకునేదెలా?

పశువుల పాలు, తేయాకుతో టీ, కాఫీ కాచుకొని తాగడం కన్నా.. ఔషధ మొక్కల ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం ఆరోగ్యదాయకం.కషాయాలను మొక్కల ఆకులతో తయారు చేసుకుంటుంటాం. గుప్పెడు ఆకులను లేదా నాలుగైదు ఆకులను తీసుకోవాలి. వాటిని 150-200 ఎం.ఎల్‍. నీటిలో వేసి 3-4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా తాగొచ్చు లేదా చల్లారినాక తాగొచ్చు. అయితే, విధిగా పరగడుపున, సాయంత్రం వేళల్లో కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తాగాలి! అంతేకాదు.. రాగి పాత్రలోని …

కషాయం కాచుకునేదెలా? Read More »

తురగా ఫౌండేషన్‍ – బాల చెలిమి

తురగా జానకీరాణి పిల్లల కథల పోటీలు జులై-సెప్టెంబర్‍ 2021పోటీ ఫలితాల ప్రకటన తురగా ఫౌండేషన్‍, బాలచెలిమి పత్రికతో కలిసి, జులై 2021లో తురగా జానకీరాణి పిల్లల కథల పోటీ ప్రకటించింది. చివరి తేదీ అయిన జులై 31కి మాకు 550కి పైగా కథలు అందాయి.word,pdf.email,text, చేతి రాతతో రాసి ఫోటో తీసిన కథలు, పోస్టులో వచ్చినవి… ఇలా 550కి పైగా…. ఒక దఫా ఫిల్టరింగ్‍ చేయగా, అంటే రిపీట్‍ లు, నిబంధనలకు సరిపడనవి..అలా రకరకాల కారణాలతో… మొత్తం …

తురగా ఫౌండేషన్‍ – బాల చెలిమి Read More »

నిజామాబాద్‍ బడి పిల్లలు ముందు వరుసలో ఉన్నారు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలూ ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. కవర్‍ పేజీ, లోపలి పేజీల బొమ్మలు కైరంకొండ బాబు వేశారు. ఆ పది జిల్లాల బడి పిల్లల కథలు దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయంలో భాగంగా ‘నిజామాబాద్‍ బడిపిల్లల కథలు’ బాల సాహితీవేత్త డా।। వి.ఆర్‍.శర్మ విశ్లేషణ.‘బాల …

నిజామాబాద్‍ బడి పిల్లలు ముందు వరుసలో ఉన్నారు Read More »

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్‍ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్‍ అనేక విలువల్ని నేర్పింది. జీవిత విధానాలను మార్చింది. ఆరోగ్య స్పృహను పెంచింది. ప్రకృతిలోనూ, మానవ ప్రవృత్తిలోనూ కాలుష్యాలను తగ్గించింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెరిగినా …

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది Read More »

బోయ జంగయ్య

 ‘కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు’ అన్నది డా।। బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం. కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో పక్రియలల్లో దిట్ట జంగయ్య అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు. నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశ్‍ముఖ్‍ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్‍ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో …

బోయ జంగయ్య Read More »

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి

(డిసెంబర్‍ 23 కె.ఆర్‍.వీరస్వామి జయంతి సందర్భంగా) 1940వ దశకంలో హైదరాబాద్‍ దళిత రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన జాతీయవాది కె.ఆర్‍.వీరస్వామి. తన ఇంగ్లీషు రచనలు, పత్రికా ప్రకటనలు, పదునైన భాషణతో ప్రత్యర్థులను పత్తాలేకుండా చేసేవాడు. వివిధ దళిత సంఘాలను స్థాపించి తన ముక్కుసూటి తనం, తలవంచని నైజంతో పనిచేసిండు. తప్పుజేసిన వారు ఎంతటి వారైనా సరే తూర్పారా పట్టేవాడు. అందులో తన బంధువులున్నా అదే తీరులో స్పందించేవాడు. మొదటి నుంచి రెబెల్‍గా వెలిగిండు. మిగతా నాయకులకు భిన్నంగా మాల, …

నిజమైన అంబేద్కరైట్‍ కె.ఆర్‍.వీరస్వామి Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది)

హైదరాబాదుకు 32 కి.మీ. దూరంలో నున్న కీసరగుట్టలో బయల్పడిన ‘తులచువాన్ఱు’ అన్న క్రీ.శ. 5వ శతాబ్ది నాటి చిన్న శాసనమే, తెలంగాణ తొలిశాసనంగా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్‍గారి ద్వారా ఇటీవల విస్తృత ప్రచారానికి నోచుకొంది. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ, 1970-80లలో కీసరగుట్టలో తవ్వకాలు చేస్తున్నపుడు, ఒక బండపై ఈ చిన్న శాసనాన్ని గుర్తించారు. విష్ణుకుండికాలపు ఈ శాసనంలో, తులచు – (తొలచు, తొలిచే) వాన్ఱు – (వారు, వాళ్లు) అంటే తొలచేవాళ్లని, రాతిని తొలిచే శిల్పులు (వడ్డర్లు కూడా …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-5 పొలమెయరట్టోడి కొండపర్తి (పూర్తి) తెలుగు శాసనం (క్రీ.శ.9వ శతాబ్ది) Read More »

మరుపురాని మాదన్నపేట

ఇద్దరు మంచి మిత్రులు ఒక జంటగా క్షణం కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా తిరుగుతుంటే వారిని చూసి ‘‘వీరిద్దరూ అక్కన్న మాదన్నలురా’’ అని అరవై ఏండ్ల క్రిందట హైదరాబాద్‍ పాత నగరంలోని ముసలివారు ముచ్చటపడేవారు. కుతుబ్‍షాహీల కాలంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఏకాత్మస్వరూపులుగా, కృష్ణార్జునులుగా కలసి బ్రతికి కలిసి చనిపోయారు. మహామంత్రి మాదన్న నివసించిన ప్రాంతమే ‘‘మాదన్నపేట’’గా తర్వాత కాలంలో వర్దిల్లింది. పాతనగరం శాలిబండలో వీరు కట్టించిన అమ్మవారి దేవాలయాన్ని ప్రజలు ఇప్పటికీ అక్కన్న మాదన్నల …

మరుపురాని మాదన్నపేట Read More »