తడి చెత్త – పొడి చెత్త : పర్యావరణ న్యాయం
మనం పలు సందర్భాలలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. వివక్షల గురించి గొంతెత్తుతూ ఉంటాం. సామాజిక రుగ్మతల గురించి వాటిని నివారించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాం. ఏ ఒక్క సదర్భంలోనూ మనకు పర్యావరణ న్యాయం గురించి గుర్తుకు రాదు. అసలు అటువంటిది ఒకటుందనే విషయం కూడా స్ఫురించదు. ఎవరి రాజకీయ దృక్పథాలు ఏవైనప్పటికి, భిన్న సామాజిక సమూహాలు ఏ రాజకీయ లక్ష్య ప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నప్పటికీ అందరమూ ఆలోచించవలసిన అవసరం …