ప్రజల జీవితంలో సాహిత్యం
సాహిత్యం అనేది హృదయగీతం. అది కథ కావొచ్చు. నవల కావొచ్చు. కవిత్వం కావొచ్చు. రచయిత తన భావాలని వ్యక్తీకరించే సాధనం సాహిత్యం. తన ఆవేశాన్ని, ఉద్దేశాన్ని బహిరంగ పరచుకునే సాధనం సాహిత్యం. రచయిత తన ఉద్దేశాలని, ఆవేశాన్నే కాదు తన తోటి ప్రజల ఆవేశాన్ని, బాధని, అనుభవాలని వ్యక్తీకరిస్తాడుసమకాలీన సమస్యలని రచయిత పట్టించుకోవాలి. వీటి మీద సృజన చెయ్యాలి. ఇప్పుడు మన దేశం అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రాజధానిలో …