తేనెగుడ్లు
కాంచీపురంలో ‘భుజంగం’ అనే తెలివైన దొంగ ఉండేవాడు. అతను తెలివిని ఉపయోగించి యుక్తిగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భుజంగం దొంగతనానికి బయలు దేరాడు. ఆ ఊరిలోని షావుకారు ఇంటి వెనుకకు వెళ్ళి మెల్లిగా గోడ దూకాడు. ఒక్కసారిగా మంచి మిఠాయిల వాసన వచ్చింది. సహజంగా భోజన ప్రియుడైన భుజంగానికి, నగలూ, డబ్బూ బదులు మిఠాయిలు దొంగిలించాలనే కోరిక కలిగింది. ఇంటి వెనక గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాడు. లోపల వంటవాడు లడ్డూలు చేస్తున్నాడు. భుజంగానికీ వెంటనే ఓ …