వావికొల్లులో ఉదయనచోడుని కొత్తశాసనం
నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలో కందూరుచోడులనాటి కొత్తశాసనం లభించింది. ఇది తెలంగాణ చరిత్రలో కొత్తపేజీ. కందూరుచోడుల పాలనాకాలానికి చేర్చిన కొత్త విశేషణం. నల్లగొండ జిల్లాకేంద్రానికి పొరుగునవున్న పానుగల్లు రాజధానిగా కందూరు-1100ల నాడును కందూరిచోడులు తొలుత కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా, తర్వాత కాకతీయ సామంతులుగా 250యేండ్లు పాలించారు. ఈ శాసనంలో పేర్కొనబడిన ఉదయనచోడుడు నల్లగొండ జిల్లా శాసనసంపుటి, వా.2లో సం.25వ, క్రీ.శ. 1149నాటి సిరికొండ శాసనంలో ప్రస్తావించబడ్డాడు. ప్రస్తుత వావికొల్లు శాసనం ఉదయనచోడుని శాసనాలలో …