deccanland

ఒక పాట వంద జ్ఞాపకాలు

బాల్యంలో మన లేత చిగురాకుల వంటి పెదాలపై తొలిసారి, ఓం ప్రథమంగ, ఒకానొక సువర్ణ ఘడియలో పలికిన, పాడినపాట ఏమైవుంటుంది? మిమ్మల్ని మీరు ఎపుడైనా ప్రశ్నించుకుని, ఆలోచించారా? ఆ పాటను మీరు పట్టుకున్నారా? మళ్లీ మీ పెదాలపై ఆ పాట నర్తనమాడిందా? ఇక అక్కడ నుండి జీవితాంతం పాటల పల్లకీలో ప్రయాణిస్తూనే ఉన్నాం కదా! పాటల లోకంలో ఊరేగుతునే ఉన్నాం కదా! మన ‘‘అమ్మలు’’ మనకు పాలు, పాట ఏక కాలంలోనే పరిచయం చేసారు. ఉగ్గుపాలతోనే పాట …

ఒక పాట వంద జ్ఞాపకాలు Read More »

ఆంత్రపోసీన్‍ యుగంలో వ్యవహార జ్ఞానం

తన మూలాలను మరిచిపోయిన యుగంలో మనుషులు ఉన్నారు. అంతే కాదు తమ మనుగడకు అవసరమైన నీరు ఇతర వనరులు మానవాళి గుడ్డితనం, పట్టనితనం వల్ల బాధితమయ్యాయి అని పేర్కొంది. రాచెల్‍ కార్సన్‍ తన సైలెంట్‍ స్ప్రింగ్‍ అనే గ్రంథంలో. ఇటీవలనే మహానగరాలకు సంభవించిన జలవిపత్తు గురించి ఆందోళన పడ్డాం. ముఖ్యంగా బెంగుళూరు లాంటి నగరం ఎదుర్కొన్న తాగునీటి సంక్షోభం గురించి తెలుసుకున్నాం. పర్యావరణానికి సంబంధించిన ప్రతి సమస్య, సంక్షోభం మనది కాదులే, మనకు రాదులే అనే ఉదాసీన …

ఆంత్రపోసీన్‍ యుగంలో వ్యవహార జ్ఞానం Read More »

సాగర అన్వేషణకు సరికొత్తగా…!! ఏ సముద్రయాన్‍

మానవాళి యొక్క నేటి అత్యున్నత ప్రగతి ప్రస్థానం వెనుక సముద్రాలు వెలకట్టలేని పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం మావన జనాభాలో మూడింట ఒక వంతు (సుమారు 2.4 బిలియన్ల జనాభా) సముద్ర తీరాలకు 100 కి.మీ.ల లోపే నివసిస్తున్నారు. సముద్రాల ద్వారా సృష్టించబడే వార్షిక సంపద విలువ 2.5 ట్రిలియన్‍ డాలర్లు. ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సమానం. ప్రపంచ ప్రజలకు కావలసిన పోషకాహారం, ఔషధాలు, ఖనిజాలు, సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా సముద్రాలు సమకూరుస్తున్నాయి. …

సాగర అన్వేషణకు సరికొత్తగా…!! ఏ సముద్రయాన్‍ Read More »

సర్వీస్‍ కమిషన్లు – తప్పిదాలు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్‍ 1 పరీక్షలను టీఎస్‍పీఎస్‍సీ ద్వారా జూన్‍ నెలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రిక్రూట్‍మెంట్‍ ఇంతకు ముందు వివాదానికి గురై, హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు అయిన విషయం పాఠకులకు తెలిసిందే. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర సర్వీస్‍ కమిషన్‍లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. దీంతో వాటి కూర్పు, పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం మన సమాజానికి సామాజిక మూలధనాన్ని ఏర్పరిచే యువత ఆశలు, ఆకాంక్షలకు సంబంధించింది. కాబట్టి …

సర్వీస్‍ కమిషన్లు – తప్పిదాలు Read More »

తమిళనాడు రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

తమిళనాడు రాష్ట్రంలో కేందప్రభుత్వం జియోలాజికల్‍ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4).1) చార్నోకైట్‍ శిల, సేంట్‍ థామస్‍మౌంట్‍ వద్ద, చెన్నైలో.2) సాత్తనూర్‍ ఫాసిల్‍వుడ్‍ పార్క్ – పెరంబలూర్‍ జిల్లా3) తిరువక్కరై ఫాసిల్‍వుడ్‍ పార్క్ – విల్లుపురం జిల్లా4) కరై బ్యాడ్‍ ల్యాంన్డస్, పెరంబలూర్‍ జిల్లాఈ జియో హెరిటేజ్‍ స్థలాలు పూర్తి వివరణ క్రింద ఇవ్వబడినది. చార్నోకైట్‍శిల, సేంట్‍ తామస్‍ మౌంట్‍, చెన్నైలోఈ చార్నోకైట్‍ శిల చెన్నైలోని సేంట్‍ థామస్‍ మౌంట్‍ వద్ద వున్నది. ఈ శిలకు చార్నోకైట్‍ …

తమిళనాడు రాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

యమునా నది కేంద్రబిందువుగా తాజ్‍ మహల్‍ అందాలు 1983లో UNESCO చే గుర్తింపు

రాష్ట్రం: ఉత్తర ప్రదేశ్‍, భారతదేశంప్రకటన తేదీ: 1983వర్గం: సాంస్క•తికం (స్మారక చిహ్నం) అత్యుత్తమ సార్వత్రిక విలువతాజ్‍ మహల్‍ను మొఘల్‍ చక్రవర్తి షాజహాన్‍ తన భార్య ముంతాజ్‍ మహల్‍ జ్ఞాపకార్థం నిర్మించాడు. దీని నిర్మాణం 1632లో ప్రారంభమై 1648లో ముగిసింది. మసీదు, గెస్ట్ హౌస్‍, ప్రధాన దక్షిణ ద్వారం, బయటి ప్రాంగణం, దాని క్లోయిస్టర్‍లు తదనంతర కాలంలో జోడించబడ్డాయి. తాజ్‍ మహల్‍ విశిష్టతను చాటిచెప్పే నిర్మాణ వినూత్నతలలో తోటల ఉద్యాన ప్రణాళిక, సమాధుల కచ్చితమైన రేఖాగణిత సమరూపత, రాతి …

యమునా నది కేంద్రబిందువుగా తాజ్‍ మహల్‍ అందాలు 1983లో UNESCO చే గుర్తింపు Read More »

సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ

2019 జూన్‍లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక రోజు గ్రాండ్‍ కాన్యాన్‍ (Grand Canyan) కొలరాడో నదీ లోయ ప్రాంతాన్ని సందర్శించడానికి పోయాము. అంతకు ఒక వారం ముందు మా బిడ్డ చదువుకున్న Texas A&M University కి వెళ్ళాము. ఈ యునివర్సిటీకి నాలుగు చోట్ల కాంపస్‍లు ఉన్నాయి. మేము కామర్స్ అనే ప్రాంతంలో ఉన్న కాంపస్‍కు వెళ్ళాము. డల్లాస్‍ నుంచి ఒక గంట ప్రయాణం. సుందరమైన, విశాలమైన కాంపస్‍. ఈ కాంపస్‍లో చదువుకున్న వాళ్ళని లయన్స్ అని …

సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ Read More »

సాహిత్యం న్యాయమూర్తులకి కూడా..

న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చట్టం శాసనాలు తెలిస్తే సరిపోదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియాలి. సాహిత్యం తెలియాలి. సంస్క•తి, తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక జీవనం కూడా తెలియాలి. ఇవి అన్నీ తెలిసినప్పుడే వారు సరైన తీర్పులని వెలువరించగలరు. చట్టం, సాహిత్యం రెండు వేర్వేరు సబ్జెక్టులుగా కనిపిస్తాయి. కానీ రెండింటికి అవినావభావ సంబంధం ఉంది. చట్టం అనేది సమాజాన్ని నియంత్రించే నియమాలు నిబంధనల గురించి చెబుతుంది. సాహిత్యం అనేది సమాజం గురించి అదే విధంగా సమాజంలోని వ్యక్తులని కళాత్మకంగా వ్యక్తీకరించే …

సాహిత్యం న్యాయమూర్తులకి కూడా.. Read More »

చదువులో వెనుక ఉన్న గద్వాల జిల్లాకు ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించాలి

పూర్వపు (యునైటెడ్‍) మహబూబ్‍నగర్‍ జిల్లా నుండి ఏర్పాటైన జోగుళాంబ గద్వాల్‍ తెలంగాణ అక్షరాస్యత చూస్తే రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో అక్షరాస్యత రేటు కేవలం 49.87% స్త్రీల అక్షరాస్యత రేటుకు 39.48% మాత్రమే. ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల మహిళల్లో ఈ రేట్లు 37.65% మరియు 30.44%తో అత్యంత వెనుకబాటులో ఉంది. 2022-23లో జిల్లాలో 6-14 సంవత్సరాల వయస్సు గల మొత్తం 1,12,312 మంది పిల్లలలో దాదాపు 68.5% …

చదువులో వెనుక ఉన్న గద్వాల జిల్లాకు ప్రత్యేక విద్యా ప్రణాళికను రూపొందించాలి Read More »

బాల కార్మిక నిర్మూలన

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్‍ 12న జరుపుకుంటారు. దీనిని ఎందుకు సమర్థించాలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్‍ 12న బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రపంచ బాల కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. చిన్నారులను పనిలో చేర్చడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం దీని లక్ష్యం. ప్రజలు, ప్రభుత్వాలు దీనికి మూలకారణంపై ద•ష్టి సారించి, సామాజిక న్యాయం, బాల కార్మికులు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని అర్థం చేసుకుంటే బాల కార్మిక వ్యవస్థను ప్రపంచం …

బాల కార్మిక నిర్మూలన Read More »