June

భూగోళంకు సహజ కవచకుండలాలు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 10 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళం ఏర్పడిన తీరు, నేల (soil), నీరు ఆవిర్భవించిన విధానం గూర్చి గత కథనాలల్లో తెలుసుకున్నాం. ప్రకృతి సూత్రాల నేపథ్యంలో జీవం పుట్టుక గూర్చి కూడా రెండో కథనంలో చూసాం. సౌరకుటుంబంలోని అష్టగ్రహాలల్లో (ప్లూటోకు గ్రహస్థితి లేదని గుర్తించాం!) కేవలం భూమిపైన మాత్రమే జీవం పుట్టి కొనసాగుతున్న విధానం గూర్చికూడా తెలియాలి. ఈ సందర్భంగా విత్తు ముందా? చెట్టు ముందా? అనే తర్కవాదన కూడా వింటూ వుంటాం. వీరికి వాస్తవం …

భూగోళంకు సహజ కవచకుండలాలు! Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

(గత సంచిక తరువాయి) గేదెజాతి పశుజాతులు :ముర్రా :దేశంలోని గేదెజాతుల్లో ‘‘ముర్రా’’ అత్యంత శ్రేష్ఠమైన జాతి. పాడికి, ఎక్కువ వెన్న శాతానికి పేరెన్నికగాంచినది. దేశవాళి గేదెజాతులనుండి అధిక పాల దిగుబడి పొందడానికి, వాటిని అప్‍గ్రేడ్‍ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిరిగా వినియోగిస్తున్నారు. హర్యానా దక్షిణప్రాంతంలోని రోమతక్‍, కర్నాల్‍, హిస్సార్‍, జిండ్‍ గార్గాన్‍ జిల్లాల్లో, పంజాబ్‍, ఢిల్లీ ప్రాంతాలు ముర్రాజాతి పుట్టినిల్లు. ముర్రాజాతి గేదెలు భారీగా ఉంటాయి. తల, మెడ తేలికగా, చిన్నగా ఉంటుంది.కొమ్ములు పొట్టిగా, గట్టిగా …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

వరహాల భీమయ్య

పుణ్యదంపుతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్యగారు. 1911, అక్టోబర్‍లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి కరీంనగర్‍లో, 9,10 తరగతులు హన్మకొండలో పూర్తి చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి ఇంటర్‍ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ తర్వాత రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ, పట్టా సంపాదించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఫస్టుర్యాంకు సంపాదించి గోల్డ్మెడల్‍ స్వంతం చేసుకొన్నారు. వీరు కరీంనగర్‍ హైస్కూల్లో టీచరుగా …

వరహాల భీమయ్య Read More »

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍

ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, రోగులకు చికిత్స చేసేవారు. రెండంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 గదులుండేవి. ఒక్కో గదిలో కనీసం నాలుగు బెడ్ల …

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍ Read More »

ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం

తెలుగు సాహిత్యంలో ప్రజా కవులు, ప్రజా కళలు, ప్రజా సాహిత్యం లాంటి మాటలు విరివిగానే వాడుకలో ఉన్నాయి. అయితే ప్రజా వాగ్గేయ సాహిత్యం అనే పదం గత రెండు మూడు దశాబ్దాలుగానే ప్రయోగంలో ఉంటూ వస్తున్నది. ఒక అర్థంలో ప్రజావాగ్గేయ సాహిత్యం అనే మాట కొత్తది. సాహిత్యంలో వాగ్గేయ సాహిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదొక ప్రత్యేక శాఖ. అసలు ప్రజా వాగ్గేయ సాహిత్యం అంటే ఏమిటనే సందేహం వస్తుంది. వాగ్గేయ సాహిత్యం, వాగ్గేయ కవిత్వం, వాగ్గేయ …

ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం Read More »

మునులగుట్ట – రెండు శాసనాలు

శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కొడుకు హకుసిరి శాసనం దొరికింది. ఈ మధ్యనే ఆ శాసన సారాంశం వెలుగు చూసింది. ఈ గ్రామంలోనే పెద్దగుట్టగా స్థానికులు పిలుచుకునే ‘పెద్దగుట్ట’, చరిత్రకారులు రాసిన పేరు మునులగుట్ట’ మీద 5 కాదు 6 రాతిపడకలున్న రాతిగుహ వుంది. ఇది జైనులస్థావరమని పివి పరబ్రహ్మశాస్త్రి వంటి చరిత్రకారులు, కాదు బౌద్ధుల వస్సా (వర్షా) వాసమని కుర్రా జితేంద్రబాబు మొదలైన చరిత్రకారుల అభిప్రాయాలున్నాయి. కాని, పెద్దపల్లివాసి …

మునులగుట్ట – రెండు శాసనాలు Read More »

మరో తిరుమల… తిరుమలనాథ కొండ

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో వారాంతపు పర్యటనల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో… ప్రత్యేకించి ఉద్యోగ కుటుంబాల్లో. అయితే, ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ వారానికి ఆదివారం ఒకటే సెలవురోజు. మరి ఈ ‘ఒక్క రోజు వెళ్ళి వచ్చే పర్యాటక స్థలాలు… నగరాల చుట్టు ఎన్ని ఉన్నాయి?’ అనే ప్రశ్నకు సమాధానం ‘అలాంటి స్థలాలు చాలా అరుదుగా ఉన్నాయి’ అని వస్తుంది. అలాంటి అరుదైన పర్యాటక స్థలాల్లో …

మరో తిరుమల… తిరుమలనాథ కొండ Read More »

వ్యాధి – వ్యాప్తి… నాడు, నేడు

‘‘భూమి మనకు సంక్రమించిన వారసత్వ సంపద కాదు. భావి తరాల నుంచి తెచ్చుకున్న అరువు ” We don’t inherit the earth, we borrow it from our children” అన్నదొక పాత అమెరికన్‍ సామెత.జనాభా లెక్కల ప్రకారం మనిషి ఆవాసాలను పల్లెలు, పట్టణాలు, నగరాలు, వాటి అంచున మురికివాడలు, అని చెప్పటం పరిపాటి. కానీ అసలు సత్యం ఏమిటంటే, భూగ్రహంపైన వాతావరణం ఉండడం ఒక అపురూపమైన పరిస్థితి. దీని వలన దాదాపు 87లక్షల జీవరాశులతో …

వ్యాధి – వ్యాప్తి… నాడు, నేడు Read More »

‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో…

తేల్చుకునేందుకు పయనమైన మన పట్టణ అతిథి శ్రామికులు రోజుకు ఒకటే పూట తింటున్నాం.. హోటల్లో పని చేసేది.. హోటల్‍ బంద్‍ పెట్టినారు… అని ఒక మహిళ చెబితే.. నేను గర్భిణీని.. నేను కూడా ఒక పూటనే తిని నీళ్ళు తాగి పడుకుంటున్నాను, మా ఇంట్లో ఇద్దరు ముసలోల్లు ఉన్నారు వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. మేము బతికి ఏం లాభం.. కరోనాతో చస్తే ఏంది ఆకలితో చస్తే ఏంది. ఈ బతుకు ఎందుకు బతుకుతున్నమో అర్ధం కావడం …

‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో… Read More »

కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍

వైరస్‍ (కరోనా) ప్రాణి కాదు. అది ఒక డియన్‍ఏ (DNA) అనబడే ప్రోటీన్‍ అణువు. దీనికి లిపిడ్‍ (కొవ్వు) అనబడే రక్షక కవచం ఉంటుంది. శరీరాన్ని చేరిన వైరస్‍, శరీర కణజాలాన్ని మార్చి వేసి (Mutation), పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. వైరస్‍ ప్రాణి కాదు కాబట్టి దీనిని చంపడం ఉండదు. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వైరస్‍ చేరిన ఉపరితల పదార్థ స్వభావాన్ని బట్టి వైరస్‍ స్వయంగానే కొంత సమయానికి విచ్ఛిన్నమవుతుంది. కరోనా వైరస్‍ పెళుసుగా లేదా సున్నితంగా (fragile) …

కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍ Read More »